విజయదశమి వేడుకల్లో భాగంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సంప్రదాయబద్ధంగా ఆయుధ పూజలు
ఆయుధ భాండాగారం, పోలీసు వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర
జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ
కామారెడ్డి, 20 అక్టోబర్: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సంప్రదాయబద్ధంగా ఆయుధ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయుధ భాండాగారంలోని ఆయుధాలకు, పోలీసు వాహనాలకు ప్రత్యేక పూజలు చేసి, పోలీసు శాఖలో ఆయుధాలు, వాహనాల ప్రాధాన్యతను గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల రక్షణకు పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోందని, పోలీసు విధుల నిర్వహణలో ఆయుధాలు, వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని, వాటి సంరక్షణలో సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పండుగ వేళ ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో వేడుకలను జరుపుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. నర్సింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్, ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాసరావు, బాన్సువాడ డీఎస్పీ పి. విట్టల్ రెడ్డి, ఇతర పోలీసు అధికారులు, రిజర్వ్ ఇన్ స్పెక్టర్లు, సబ్ ఇన్ స్పెక్టర్లు, మోటార్ ట్రాన్స్ పోర్ట్ విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Post a Comment