Night Cricket | బాన్సువాడ మినీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల వెలుగులో తొలిసారి నైట్ క్రికెట్

బాన్సువాడ మినీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల వెలుగులో తొలిసారి నైట్ క్రికెట్

ఈ నెల 24 నుంచి టోర్నీ ప్రారంభం - విజేతకు రూ.20 వేలు, రన్నరప్ కు రూ.10 వేలు ప్రైజ్ మనీ

ఎంట్రీ ఫీజు రూ.800 - ఆసక్తిగల జట్లు 23లోపు పేర్లు నమోదు చేసుకోవాలి

బాన్సువాడ, అక్టోబర్ 21 : బాన్సువాడ పట్టణంలో మొట్టమొదటిసారిగా ఫ్లడ్ లైట్ల వెలుగులో నైట్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు.

పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో ఈ నెల 24 నుంచి టోర్నమెంట్ ప్రారంభం కానుందని నిర్వాహకులు ఖూదుస్, ఆఫ్రోజ్, లాలా, ఇమ్రాన్, ఖాలేద్ తెలిపారు.

ఎంట్రీ ఫీజు రూ.800 చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని, 23వ తేదీన డ్రా తీసి 24న రాత్రి టోర్నమెంట్ ప్రారంభిస్తామని వారు తెలిపారు. విజేత టీమ్ కు రూ.20 వేలు, రన్నర్ టీమ్ కు రూ.10 వేలు నగదు బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఒక జట్టులో 8 మంది ఆటగాళ్లు ఉంటారని, ఒక్కో జట్టుకు 7 ఓవర్లు ఉంటాయని, ఒక జట్టులో ఆడిన ఆటగాడు మరో జట్టులో ఆడరాదని, షార్ట్ బౌండరీ ఉంటుందని నిబంధనలు పెట్టినట్లు వారు తెలిపారు.

గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు తమ నైపుణ్యం చూపించుకునే వీలు కలుగుతుందని, దేహదారుఢ్యంతో పాటు క్రీడా నైపుణ్యం, క్రీడా స్ఫూర్తి పెంపొందించేందుకు ఉపయోగకరంగా ఉంటుందని ఈ కొత్త ఆలోచనతో బాన్సువాడలో మొదటిసారిగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

Post a Comment

Previous Post Next Post