అక్రమ వడ్డీ వ్యాపారులపై నిజామాబాద్ పోలీసుల మెరుపు దాడులు
67 ప్రాంతాల్లో తనిఖీలు - 42 చోట్ల చెక్కులు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం
బాధితులు భయపడకుండా పోలీసులను ఆశ్రయించండి: సీపీ సాయి చైతన్య
నిజామాబాద్, 17 అక్టోబర్: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో శనివారం ఉదయం నుంచి అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసులు విస్తృతంగా మెరుపు దాడులు నిర్వహించారు.
కమిషనరేట్ పరిధిలో మొత్తం 67 ప్రాంతాల్లో అనుమానిత వడ్డీ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. 42 ప్రాంతాల్లో చెక్కులు, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు, నగదు తదితర కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. అప్పుల పేరుతో బెదిరించడం, బలవంతంగా పత్రాలు తీసుకోవడం, అధిక వడ్డీలు వసూలు చేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వేధింపులకు గురవుతున్న బాధితులు భయపడకుండా సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.


Post a Comment