బాన్సువాడ ఆర్డీఓ కార్యాలయంలో అఖిల పక్ష సమావేశం
SSR 2026 పై రాజకీయ పార్టీలతో ERO సమీక్ష
571 ఓట్లు తొలగింపు, ఫైనల్ డ్రాఫ్ట్ నవంబర్ 9న ప్రచురణ
బాన్సువాడ, అక్టోబర్ 29: బాన్సువాడ ఆర్డీఓ కార్యాలయంలో ERO ఆధ్వర్యంలో గురువారం అఖిల పక్ష సమావేశం నిర్వహించారు.
ఆర్డీఓ రవీందర్ రెడ్డి, తహసీల్దార్ రాజా నరేందర్, మున్సిపల్ కమిషనర్ గంగాధర్, డిప్యూటీ తహసీల్దార్ కాపర్తి సంగమేశ్వర్ లు బూత్ స్థాయి అధికారులు (BLO) మరియు కాన్స్టెన్సీ ఇంచార్జ్‌లతో SSR - 2026 (Special Summary Revision) పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, టీడీపీ, MIM తదితర రాజకీయ పార్టీల ప్రతినిధులు అబ్దుల్ ఖాళీక్, శంషాద్దీన్, రమేష్ యాదవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ముఖ్యాంశాలు:
- SIR నోటీసుకు స్పందించని 571 ఓట్లను బాన్సువాడ నియోజకవర్గంలో తొలగించడం జరిగింది.
- Final Voter Draft Publication 09-Nov-2026 న ప్రచురించనున్నారు.
01-01-2026 నుండి 29-10-2026 వరకు ఫారాల వివరాలు:
- Form-6: Total Received - 3048, Eroll Updated - 1305, Pending - 1368
- Form-7: Total Received - 25223, Eroll Updated - 24876, Pending - 180
- Form-8: Total Received - 3919, Eroll Updated - 1720, Pending - 1477
మొత్తం Form 6,7,8 కలిపి: Total Received - 32190, Eroll Updated - 27901, Total Pending - 3025.

Post a Comment