బాన్సువాడ నియోజకవర్గంలో 142 మందికి కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
రూ. 1.42 కోట్ల చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
వర్ని జనరల్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా పంపిణీ కార్యక్రమం
బాన్సువాడ, అక్టోబర్ 29: బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండల కేంద్రంలోని జనరల్ ఫంక్షన్ హాల్ లో గురువారం కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.
వర్ని, చందూర్, మోశ్రా, రుద్రూర్, పోతంగల్, కోటగిరి మండలాలకు చెందిన 142 మంది లబ్ధిదారులకు చెక్కులను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
లబ్ధిదారుల వివరాలు:
వర్ని మండలం: 20 మంది లబ్ధిదారులకు రూ. 20,02,320/-
చందూర్ మండలం: 12 మంది లబ్ధిదారులకు రూ. 12,01,392/-
కోటగిరి మండలం: 29 మంది లబ్ధిదారులకు రూ. 29,03,364/-
పోతంగల్ మండలం: 30 మంది లబ్ధిదారులకు రూ. 30,03,480/-
మోశ్రా మండలం: 21 మంది లబ్ధిదారులకు రూ. 21,02,436/-
రుద్రూర్ మండలం: 30 మంది లబ్ధిదారులకు రూ. 30,03,480/-
మొత్తం 142 మంది లబ్ధిదారులకు రూ. 1,42,16,472/- ల చెక్కులను పంపిణీ చేశారు.






Post a Comment