SGT Union | నస్రుల్లాబాద్ మండల అధ్యక్షుడిగా మురళి ఎన్నిక

SGT యూనియన్ నస్రుల్లాబాద్ మండల అధ్యక్షుడిగా మురళి ఎన్నిక

నస్రుల్లాబాద్, అక్టోబర్ 8:

నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో గురువారం SGT యూనియన్ మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యాల సంతోష్ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది.

నూతనంగా ఎన్నికైన కార్యవర్గం:

- మండల అధ్యక్షులు - సాతు మురళి

- ప్రధాన కార్యదర్శి - లక్క సంతోష్

- ఉపాధ్యక్షుడు - దర్శనం పర్వయ్య

- కోశాధికారి - బోయిని సాయి కుమార్

- మహిళా అధ్యక్షురాలు - శిరీష

- మహిళా కార్యదర్శి - నర్మద

- సాంకేతిక కార్యదర్శి - యోగి వివేక్

- జాయింట్ సెక్రటరీ - కండెల రాజ్ కుమార్

- సలహాదారు - గైని దత్తు

- కార్యవర్గ సభ్యులు - అభిషేక్, సాయికిరణ్, అనిల్ కుమార్, భాగ్యలక్ష్మి

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యాల సంతోష్ మాట్లాడుతూ.. SGT యూనియన్ ఎల్లప్పుడూ SGT ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని అన్నారు. SGT లకు టీచర్స్ MLC ఓటు హక్కు కల్పించాలని, GO 25 మరియు GO 317 ను రద్దు చేయాలనే డిమాండ్ల కోసం నిరంతరం పోరాడుతుందని తెలిపారు. SGT ఉపాధ్యాయులు ఐక్యంగా ఉన్నప్పుడే అనుకూల జీవోలు వస్తాయని, అందుకోసం అందరూ సమస్యలను గుర్తించి పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో హన్మాండ్లు, ప్రతాప్ గౌడ్, సత్యవ్వ, దివ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post