SP'sTraining | కేసుల దర్యాప్తులో నాణ్యతే లక్ష్యం

 

కేసుల దర్యాప్తులో నాణ్యతే లక్ష్యం.. బాధితులకు సత్వర న్యాయం

రైటర్లకు శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి, అక్టోబర్ 13: కేసుల దర్యాప్తులో నాణ్యత, ఖచ్చితత్వం పాటించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ పోలీసు రైటర్లను ఆదేశించారు.

జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం జిల్లాలోని పోలీస్ స్టేషన్లు, సీఐ, డీఎస్పీ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న రైటర్లకు కేసుల నమోదు, దర్యాప్తు ప్రక్రియపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ రైటర్లతో స్వయంగా మాట్లాడి శిక్షణలో నేర్చుకున్న అంశాలు, కేసుల నమోదు ప్రక్రియలపై వారి అవగాహనను అడిగి తెలుసుకున్నారు. ఎఫ్ఐఆర్ నుంచి చార్జ్ షీట్ వరకు ప్రతి అంశాన్ని సమగ్రంగా, స్పష్టంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నమోదు చేయాలని సూచించారు.

సాక్షుల వాంగ్మూలాలను వాస్తవాల ఆధారంగా నమోదు చేయాలని, సాక్ష్యాధారాల సేకరణ, భద్రపరచడంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఆధునిక పోలీసింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, విధి నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు పాటించి పోలీసు శాఖపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి, ఇతర పోలీసు అధికారులు, జిల్లా వ్యాప్తంగా ఉన్న రైటర్లు పాల్గొన్నారు.


Post a Comment

Previous Post Next Post