Suicide Attempt | డయల్ 112 కు ఫోన్ చేసి రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నం

డయల్ 112 కు ఫోన్ చేసి రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నం 

సమన్వయంతో ప్రాణం కాపాడిన కామారెడ్డి పోలీసులు

కామారెడ్డి, అక్టోబర్ 14: ఆపదలో మానవత్వాన్ని చాటుకున్నారు కామారెడ్డి జిల్లా పోలీసులు. ఆత్మహత్య చేసుకోబోతున్నానని డయల్ 112 కు ఫోన్ చేసిన వ్యక్తిని సమయస్ఫూర్తితో కాపాడారు.

కామారెడ్డి జిల్లా పోసానిపేట్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వ్యక్తిగత సమస్యలతో మనస్తాపానికి గురై అడ్లూరు శివారులో రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంటానని డయల్ 112 కు సమాచారం ఇచ్చారు.

వెంటనే అప్రమత్తమైన దేవునిపల్లి పోలీస్ సిబ్బంది పీసీ రమేష్, హోంగార్డు భూపతి బాధితుడికి ఫోన్ చేసి నిరంతరం మాట్లాడుతూ ధైర్యం చెబుతూనే ఉన్నారు. అదే సమయంలో రామారెడ్డి పెట్రోల్ కార్ ఏఎస్ఐ పండరి గౌడ్ తో సమన్వయం చేసుకుని సాంకేతికంగా అతని లొకేషన్ గుర్తించారు.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యాయత్నాన్ని విరమింపజేసి, అతన్ని సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

సకాలంలో స్పందించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ అభినందించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ "జీవితం ఎంతో విలువైనది. వ్యక్తిగత సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులతో బాధను పంచుకోవాలి. ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదు. ఆపదలో ఉన్నవారు వెంటనే డయల్ 112 కు కాల్ చేయవచ్చు" అని సూచించారు.

Post a Comment

Previous Post Next Post