బాధిత కుటుంబానికి రూ.50 లక్షల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ, అక్టోబర్ 14: బాన్సువాడకు చెందిన కానిస్టేబుల్ గడ్డం రఘు ఇటీవల అకాల మరణం చెందగా, అతని కుటుంబానికి టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన రూ.50 లక్షల చెక్కును బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. Video 👇
కానిస్టేబుల్ రఘు గతంలో టాటా ఏఐఏ పాలసీ తీసుకుని రూ.71 వేల చొప్పున రెండుసార్లు ప్రీమియం చెల్లించారు. అకాల మరణంతో పాలసీ మొత్తం రూ.50 లక్షలను సంస్థ అతని భార్య గడ్డం రజనికి చెల్లించింది.
బుధవారం ఉదయం టాటా ఏఐఏ సంస్థ ప్రతినిధులు ఈ చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా బాధితురాలికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ, రఘు మృతి దురదృష్టకరమని, అతని కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, టాటా ఏఐఏ ప్రతినిధులు పాల్గొన్నారు.


Post a Comment