BRS Leaders | అఫ్జల్ ఖాన్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు

అఫ్జల్ ఖాన్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు

బాన్సువాడ, అక్టోబర్ 14: రష్యాలో బలవంతంగా ఆర్మీలో చేర్చబడి మృతి చెందాడని సమాచారం వచ్చిన ఎండీ అఫ్జల్ ఖాన్ కుటుంబాన్ని బుధవారం బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం పరామర్శించింది.

బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామానికి చెందిన అఫ్జల్ ఖాన్ రష్యాలో చనిపోయాడన్న వార్తతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఇప్పటి వరకు అధికారిక సమాచారం అందకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు తాడ్కోల్ వెళ్లి అఫ్జల్ తండ్రి అబ్బాస్ ఖాన్ కు ధైర్యం చెప్పారు. తమ పార్టీ తరపున, ఎంపీల ద్వారా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అఫ్జల్ మృతిపై స్పష్టత తెచ్చేందుకు, కుటుంబానికి అవసరమైన సహాయం అందించేందుకు కృషి చేస్తామని షేక్ జుబేర్ హామీ ఇచ్చారు.

ఈ పరామర్శలో నాయకులు షేక్ అక్బర్, రమేష్ యాదవ్, ఇసాక్, అహ్మద్, అతిఫ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post