AICC Observer Hasan | ఓటును కాపాడుకుంటేనే దేశం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం |

"ఓటును కాపాడుకుంటేనే దేశం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం నిలబడతాయి" - ఏఐసీసీ పరిశీలకుడు హసన్ మౌలానా

కామారెడ్డిలో "ఓటు బచావో - దేశ్ బచావో" ప్రెస్ మీట్ లో కీలక వ్యాఖ్యలు

కామారెడ్డి, అక్టోబర్ 27: ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కు...ఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత...ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఓటర్ల హక్కుల పరిరక్షణ కోసమే కాంగ్రెస్ "ఓటు బచావో - దేశ్ బచావో" కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోందని ఏఐసీసీ పరిశీలకులు, తమిళనాడు మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జె.ఎం.హెచ్. హసన్ మౌలానా పేర్కొన్నారు. "ఓటు బచావో - దేశ్ బచావో" కార్యక్రమంలో భాగంగా  మంగళవారం కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాముఖ్యత, ఓటు హక్కు పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత వంటి అంశాలపై "ఓటు బచావో - దేశ్ బచావో" కార్యక్రమ లక్ష్యాలను వివరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం, ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించడం, ఓటర్ల హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

ఈ కార్యక్రమంలోజిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, TPCC ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ గౌడ్, మాజీ DCC అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ST సెల్, SC సెల్, BC సెల్, మైనారిటీ సెల్, సేవాదళ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, DCC ఉపాధ్యక్షులు యూనుస్ పటేల్, పండ్ల రాజు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఐరేని సందీప్ కుమార్ తదితరులు, వివిధ మండలాల మండల అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





Post a Comment

Previous Post Next Post