Minister Seethakka Visit |పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

నేడు మంత్రి సీతక్క కామారెడ్డి జిల్లా పర్యటన 

పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు 

కామారెడ్డి, అక్టోబర్ 27: తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క నేడు (మంగళవారం) కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా అధికారిక పర్యటన షెడ్యూల్ విడుదల చేసింది.

పర్యటన వివరాలు:

ఉదయం 8.30 కి నిజామాబాద్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గాన రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చేరుకుంటారు.

ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 1.45 వరకు:

- పోసానిపేట (V), రామారెడ్డి (M) లో మహిళా సంఘం (VO) భవన ప్రారంభోత్సవం

- గిద్దె (V), రామారెడ్డి (M) లో నూతన సబ్ స్టేషన్ స్థల పరిశీలన

- కుప్రియాల్ (V), సదాశివనగర్ (M) లో నూతన సబ్ స్టేషన్ స్థల పరిశీలన

- అనంతరం లంచ్ (రిజర్వ్ డ్)

మధ్యాహ్నం 2.00 కి కుప్రియాల్ నుంచి బాన్సువాడ మండలం కొయగూట్ట తండాకు ప్రయాణం.

మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు:

- కొయగూట్ట తండా (V), బాన్సువాడ (M) లో GP భవనం, SHG భవనానికి శంకుస్థాపన

- కొయగూట్ట (V) లో 4వ తరగతి ఉద్యోగుల కాలనీలో మహిళా మండలి భవన ప్రారంభోత్సవం

- బోర్లం (V), బాన్సువాడ (M) లో సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం, బహిరంగ సభలో పాల్గొంటారు.

సాయంత్రం 5.30 కి బోర్లం నుంచి బయలుదేరి రాత్రి 8.30 కి హైదరాబాద్ బేగంపేట్ లోని ప్రజా భవన్ నివాసానికి చేరుకుంటారు. పర్యటన మొత్తం రోడ్డు మార్గాన సాగనుంది.

జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

Post a Comment

Previous Post Next Post