Bhubharati Survey | కూనీపూర్ లో భూ భారతి భూముల సర్వే ప్రారంభం

కూనీపూర్ లో భూ భారతి భూముల సర్వే ప్రారంభం

భూ సమస్యల పరిష్కారానికి సర్వే చేపట్టిన అధికారులు

కూనీపూర్ లో సర్వే పనులను పరిశీలించిన సర్పంచ్

వర్ని, నవంబర్ 4: వర్ని మండల్ కూనీపూర్ గ్రామంలో భూ భారతి భూముల సర్వే ప్రారంభించడం జరిగింది. గ్రామంలోని భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు, భూ రికార్డులను సరిచేసేందుకు అధికారులు ఈ సర్వేను చేపట్టారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోయిడి లక్ష్మణ్ ముదిరాజ్, సర్వేర్ డి చంద్రయ్య, ఆర్ఐ భీమేష్, మాజీ సొసైటీ చైర్మన్ గోపాల్ రెడ్డి, కాంతారావు, రెడ్డి వినోద్, శివకుమార్, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో భూములకు సంబంధించి ఉన్న వివాదాలను సర్వే ద్వారా పరిష్కరించుకోవాలని, రైతులు సర్వే సిబ్బందికి సహకరించాలని కోరారు. సర్వే పనులు పారదర్శకంగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు.



Post a Comment

Previous Post Next Post