Maha Padayatra | బాన్సువాడ నుండి శబరిమలకు సువర్ణ భూమి మహా పాదయాత్ర ప్రారంభం

బాన్సువాడ నుండి శబరిమలకు సువర్ణ భూమి మహా పాదయాత్ర ప్రారంభం

అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పోచారం

జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే

బాన్సువాడ, నవంబర్ 5: బాన్సువాడ నుండి పవిత్ర శబరిమల క్షేత్రం వరకు సువర్ణ భూమి శబరిమల మహా పాదయాత్ర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో బాన్సువాడ పట్టణం భక్తిమయంగా మారింది.

బాన్సువాడ పట్టణ కేంద్రంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి అనంతరం పాదయాత్రకు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ మాజీ చైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి, గురువినయ్ కుమార్, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాన్సువాడ పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు, అయ్యప్ప గురుస్వాములు, స్వాములు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో విజయవంతం చేశారు.







Post a Comment

Previous Post Next Post