![]() |
| సంఘటన స్థలంలో విచారణ జరుపుతున్న దృశ్యం పెళ్లి కార్డు ఇవ్వడానికి అమ్మమ్మ ఊరికి వచ్చిన యువతి |
ఇటీవలే నిశ్చితార్థం.. ఇంతలో యువతి హత్య
గాంధారిలో విషాదం.. కుటుంబంలో తీరని శోకం
గాంధారి, నవంబర్ 7: పెళ్లి కార్డు పంచడానికి సంతోషంగా అమ్మమ్మ ఊరికి వచ్చిన ఒక యువతి, మరుసటి రోజు ఉదయం విగతజీవిగా కనిపించడం గాంధారి మండలాన్ని విషాదంలో ముంచింది.
కామారెడ్డికి చెందిన ఆర్తి కౌర్ (19) తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ లో నివాసం ఉంటోంది. కొంతకాలంగా ఉపాధి కోసం హైదరాబాద్ కు వలస వెళ్లిన ఆ కుటుంబం, ఇటీవలే ఆమెకు నిశ్చితార్థం చేసింది. పెళ్లి నిశ్చయమైన ఆనందంలో, బంధువులకు పెళ్లి కార్డు ఇచ్చేందుకు ఆమె వారంరోజుల క్రితం గాంధారిలోని తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది.
శుక్రవారం అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చిన యువతి తిరిగి ఇంటికి వెళ్లలేదు. శనివారం ఉదయం ఆమె కనిపించడం లేదని బంధువులు చుట్టుపక్కల గాలించగా సెల్ టవర్ వద్ద ఆమె విగతజీవిగా కనిపించింది.
కాగా ఆమె ను ఎవరైనా హత్య చేశారా? లేదా సెల్ టవర్ ఎక్కి కింద దూకి ఆత్మహత్య చేసుకొందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఆమె బంధువులను విచారిస్తున్నారు. ఏం జరిగిందో, ఎవరు ఇందుకు కారణమో తేలాల్సి ఉంది.
ఆమె మృతితో కుటుంబం చిన్నాభిన్నమైంది. కొన్ని రోజుల క్రితం వరకు పెళ్లి కబుర్లతో కళకళలాడిన ఇల్లు ఒక్కసారిగా శోకంలో మునిగిపోయింది. ఇంకా కొత్త జీవితం ప్రారంభించాల్సిన వయసులో ఆమె ఇలా దూరం కావడం బంధువులను, గ్రామస్తులను కలచివేస్తోంది.
ఒక కుటుంబం పెళ్లి సంతోషంలో ఉండగా, ఇలాంటి ఘటన జరగడం అందరినీ కదిలిస్తోంది. నిందితులను త్వరగా గుర్తించి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
--------------------





Post a Comment