Top News

17 Ward Councillor |మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్

నిరుపేద పెళ్ళికి ఆర్థిక సహాయం

మరోసారి మాట నెరవేర్చుకున్న  17 మున్సిపల్ కౌన్సిలర్

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:

            మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో తాను ఇచ్చిన హామీలలో ఒకటైన ప్రతి ఆడ బిడ్డ పెళ్లి కి సంబంధించి ఆర్థిక సహాయం అందిస్తానని చెప్పి నేడు ఆయన నెరవేర్చుతున్నారు. ఇప్పటి వరకు ఇద్దరికీ సహాయం అందించారు. ఆయనే 17వ వార్డు కౌన్సిలర్  భర్త అబ్దుల్ లాయక్....

             ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం నాడు మరోసారి తన 17వ వార్డు వాసి  డబల్ బెడ్ రూమ్ కాలనీ లో నివసిస్తున్న ఓ పేద కుటుంబంలో పెళ్లి కార్యక్రమం ఉన్నదని తెలిసిన వెంటనే ఏఐఎంఐఎం 17 వార్డు కౌన్సిలర్ భర్త అబ్దుల్ లాయక్ వారి ఇంటికి వెళ్లి ఒక క్వింటాల్ బియ్యం, కిరణ కొరకు 5000 రూపాయలు నగదు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన కు పలువురు ప్రశంశించారు.

ఈ కార్యక్రమం లో బాన్సువాడ ఎంఐఎం పార్టీ అధ్యక్షులు సయీద్ ఖాన్, నేతలు అంజాద్ ఖాన్, హాశం,రసూల్, అస్లాం, ఐజాజ్, సుభాన్, అబ్దుల్ హఫీజ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.



Post a Comment

Previous Post Next Post