Girl Child Trafficking |ఆడ శిశువును ₹లక్షకు విక్రయించిన తల్లి

కేసు నమోదు చేసిన పోలీసులు

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:

ముగ్గురు ఆడపిల్లల తర్వాత మళ్ళీ నాలుగో సంతానం కూడా ఆడ శిశువే జన్మించడంతో, పోషించలేక ఓ తల్లి తన 18 రోజుల శిశువును లక్ష రూపాయలకు విక్రయించింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో కొనుగోలు చేసిన, విక్రయించిన వారిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.... (Vedio👇👇)


కామారెడ్డి జిల్లా బాన్సువాడ  మండలం సోమేశ్వర్  గ్రామంలో  అమానుష ఘటన జరిగింది.   నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామనికి చెందిన ఓ మహిళ తన 18 రోజుల ఆడ శిశువును బీర్కూర్ మండలం దామరంచ గ్రామానికి చెందిన మహిళ కు లక్ష రూపాయలకు అమ్మింది.

నలుగురు అమ్మాయిలు పుట్టడంతో  ఆడ పిల్లలను పోషించలేక 4 వ పాపను అమ్మినట్లు తల్లి  తెలిపింది.  ఈ విషయంలో ఐదుగురి పై కేసు నమోదు చేసినట్లు సిఐ తుల శ్రీధర్ తెలిపారు.





Post a Comment

Previous Post Next Post