Accreditation Cards | తెలంగాణలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు అక్రిడిటేషన్ కార్డుల పెంపు

 


•తెలంగాణలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు అక్రిడిటేషన్ కార్డుల పెంపు  

•రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ 

•సర్క్యులేషన్ ఆధారంగా కేటాయింపు

తెలంగాణ డైలీ న్యూస్ బ్యూరో, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అక్రిడిటేషన్ కార్డులను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ (I&PR) విభాగం 27.04.2026న మెమో నం.321/I&PR/2026 విడుదల చేసింది.

ఏప్రిల్ 10, 2026న జరిగిన 3వ స్టేట్ మీడియా అక్రిడిటేషన్ కమిటీ (SMAC) సమావేశ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్పెషల్ కమిషనర్, I&PR విభాగం నివేదిక ఆధారంగా అక్రిడిటేషన్ కార్డులను సవరించారు.

ప్రింట్ మీడియా అక్రిడిటేషన్స్:

1. సర్క్యులేషన్ 2.50 లక్షల పైన: స్టేట్ లెవల్ 20 C, 20 D, 5 Ph. స్పోర్ట్స్, కల్చర్, ఫిల్మ్స్ ఒక్కొక్కటి 1 C. కార్టూనిస్ట్ 1. ఢిల్లీ 1 C, 1 Ph. హైదరాబాద్ 8 C, 8 D, 2 Ph. పబ్లిక్ సెంటర్ 8 D. జిల్లా స్థాయి 2 C, 1 Ph.

2. సర్క్యులేషన్ 75,000 నుండి 2.50 లక్షలు: స్టేట్ లెవల్ 16 C, 16 D, 4 Ph. స్పోర్ట్స్, కల్చర్, ఫిల్మ్స్ ఒక్కొక్కటి 1 C. కార్టూనిస్ట్ 1. ఢిల్లీ 1 C, 1 Ph. హైదరాబాద్ 6 C, 6 D, 1 Ph. పబ్లిక్ సెంటర్ 6 D. జిల్లా స్థాయి 2 C, 1 Ph.

3. సర్క్యులేషన్ 25,001 నుండి 75,000: స్టేట్ లెవల్ 12 C, 12 D, 2 Ph. ఢిల్లీ 2 C, 2 D. హైదరాబాద్ 2 D. జిల్లా స్థాయి 1 C, 1 Ph.

నోట్: సీరియల్ నం. 1, 2 కేటగిరీలకు మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాల్లో అదనంగా ఒక క్రైమ్ రిపోర్టర్‌కు అక్రిడిటేషన్ ఇస్తారు.

ఎలక్ట్రానిక్ మీడియా అక్రిడిటేషన్స్:

1. శాటిలైట్ ఛానల్స్: స్టేట్ లెవల్ 10C, 10D, 10CM. స్పోర్ట్స్, కల్చరల్, ఫిల్మ్స్ ఒక్కొక్కటి 1C, 1CA. కార్టూనిస్ట్ 1.

2. కేబుల్ ఛానల్స్: 20 జిల్లాలకు పైగా కవరేజ్, రోజుకు 4 న్యూస్ బులెటిన్లు 30 నిమిషాలు - 4C, 4D, 4CM. 10 నుండి 19 జిల్లాలు - 3C, 3D, 3CM. 5 నుండి 9 జిల్లాలు - 2C, 2D, 2CM. 1 నుండి 5 జిల్లాలు - 1C, 1D, 1CM.

నోట్: నియోజకవర్గ స్థాయిలో అక్రిడిటేషన్ కార్డులు BARC రేటింగ్‌తో సంబంధం లేకుండా అన్ని శాటిలైట్ ఛానల్స్‌కు ఇస్తారు.

ఈ సవరించిన నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని స్పెషల్ కమిషనర్, I&PR విభాగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. (జీ ఓ కాపీ 👇)








Post a Comment

Previous Post Next Post