•నేడు, రేపు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో మంత్రి సీతక్క పర్యటన
•దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు, ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం, కాంగ్రెస్ భవన్ నిర్మాణానికి భూమి పూజ
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. డి అనసూయ సీతక్క ఏప్రిల్ 28, 29 తేదీల్లో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. పర్యటన వివరాలు:
ఏప్రిల్ 28(మంగళ) కార్యక్రమాలు(కామారెడ్డి):
1. మధ్యాహ్నం 12:30 - హైదరాబాద్ ప్రజాభవన్ నుండి కామారెడ్డి IDOCకు బయలుదేరుట.
2. సా. 2:30 - SP కార్యాలయం వద్ద సఖి వన్ స్టాప్ సెంటర్ భవన ప్రారంభోత్సవం.
3. సా. 3:00 - IDOC కామారెడ్డిలో సమీక్షా సమావేశం. దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ - రెట్రోఫిట్ మోటరైజ్డ్ స్కూటీలు 64, బ్యాటరీ వీల్ చైర్లు 8, మొబైల్ బిజినెస్ ట్రై సైకిల్స్ 3, మినీ ట్రేడింగ్ ఆటోలు 2, హైబ్రిడ్ వీల్ చైర్లు 2.
4. సా. 5:00 - కళాభారతి ఆడిటోరియంలో కౌమార బాలికల సమస్యలపై అవగాహన కార్యక్రమం, CCIలకు స్పోర్ట్స్ కిట్ల పంపిణీ.
5. సా. 6:00 నుండి 8:00 - ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం, లబ్ధిదారులతో విందు.
6. రాత్రి 9:30 - నిజామాబాద్ R&B గెస్ట్ హౌస్‌లో బస.
ఏప్రిల్ 29 (బుధ) కార్యక్రమాలు (నిజామాబాద్):
1. ఉ. 8:10 - మల్కాపూర్‌లో MGNREGS పని ప్రదేశ సందర్శన.
2. ఉ. 8:50 - నిజామాబాద్ పాత కలెక్టరేట్ గ్రౌండ్లో స్నేహ కార్యక్రమం.
3. ఉ. 9:45 - రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు, అప్లయన్సెస్ పంపిణీ.
4. ఉ. 10:30 - రైల్వే స్టేషన్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భూమి పూజ.
5. మ. 2:00 - హైదరాబాద్ శిల్పకళావేదికలో వెంకయ్య నాయుడు కార్యక్రమంలో పాల్గొననున్నారు.


Post a Comment