Top News

Arya Vyshya Mahasabha | తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షుడికి సన్మానం

 

- తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా అమరవాది లక్ష్మీనారాయణ ఎన్నిక 

- ప్రముఖుల సన్మానం

తెలంగాణ డైలీ న్యూస్, హైదరాబాద్:

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షులుగా అమరవాది లక్ష్మీనారాయణ గారు ఎన్నికైన సందర్భంగా హైదరాబాద్ లో ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు, కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కైలాష్ శ్రీనివాస్, కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు, బాన్సవాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత బాలకృష్ణ, కామారెడ్డి జిల్లా మాజీ కోశాధికారి తుప్తి నాగరాజు నూతన అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సమాజ అభివృద్ధికి, ఐక్యతకు కృషి చేయాలని ఆకాంక్షించారు. నూతన అధ్యక్షులు సభ్యుల సహకారంతో సంఘాన్ని మరింత బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు.




Post a Comment

Previous Post Next Post