👉చెట్టును ఢీకొట్టి కుప్ప కూలిన విమానం
👉పైలట్, కో-పైలట్ మృతి
(తెలంగాణ డైలీ న్యూస్ డెస్క్)
ఛత్తీస్‌గఢ్‌లోని జశ్‌పుర్ జిల్లా కొండ ప్రాంతంలో సోమవారం ఒక ప్రైవేటు జెట్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో జెట్‌లోని పైలట్, కో-పైలట్ ఇద్దరూ మరణించినట్లు ప్రాథమిక సమాచారం. జెట్ కుప్పకూలిన సమాచారం తెలిసిన వెంటనే ఎస్‌ఎస్‌పీ లాల్ ఉమీద్ సింగ్ సహా సీనియర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది (👇).
జశ్‌పుర్ జిల్లా కొండ ప్రాంతంలో ప్రైవేటు జెట్ ఒకటి సోమవారంనాడు కుప్పకూలింది. ఆరా హిల్స్‌లో తొలుత చెట్టును ఢీకొట్టి ఆ తర్వాత కుప్పకూలినట్లు స్థానికులు తెలిపారు. దీంతో మంటలు ఎగసిపడి పొగ చుట్టుపక్కలకు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో జెట్‌లోని పైలట్, కో-పైలట్ మరణించినట్లు ప్రాథమిక సమాచారం. జెట్ కుప్పకూలిన సమయంలో అందులో ఇంకెవరైనా ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది.

Post a Comment