ఆవు దొంగతనం కేసు: నిందితుడికి 6 నెలల జైలు శిక్ష
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి : మద్నూర్ మండలంలో 2017లో జరిగిన ఆవు దొంగతనం కేసులో నిందితుడికి ఆరేళ్ల తర్వాత శిక్ష పడింది. బిచ్కుంద జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ నిందితుడికి 6 నెలల జైలు శిక్ష విధించారు.
*కేసు వివరాలు:*
మద్నూర్ గ్రామానికి చెందిన జవర్ కపిల్ తన 10 ఆవులను 23.04.2017 సాయంత్రం ఊరి చివరన గల కొట్టంలో కట్టేసి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం వెళ్లి చూడగా 12 ఏళ్ల వయసు గల, సుమారు రూ.24,000 విలువ చేసే ఎరుపు రంగు ఆవు కనిపించలేదు. తాడు తెంపబడి ఉండటంతో ఎవరో దొంగిలించారని మద్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
*దర్యాప్తు – శిక్ష:*
సీసీ కెమెరాలు, ఇతర సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సలాబత్పూర్ గ్రామానికి చెందిన రాపన్ వాడ్ సాయిలు (35) నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. సాక్ష్యాధారాలతో కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు.
సాక్షుల వాంగ్మూలం, ఆధారాలను పరిశీలించిన బిచ్కుంద జేఎఫ్‌సీఎం జాడ వినీల్ నేరం రుజువు కావడంతో నిందితుడు సాయిలుకు 6 నెలల జైలు శిక్ష విధించారు.
ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన ఏపీపీ బి. రాజేష్ గౌడ్, గత మద్నూర్ ఎస్ఐ ఎం. కాశీనాథ్, ప్రస్తుత ఎస్‌హెచ్ఓ మోహన్ రెడ్డి, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్ఐ రామేశ్వర్ రెడ్డి, సీడీఓ ఏ. ఓంకార్‌లను జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర అభినందించారు.

Post a Comment