సకాలంలో ఇండ్లు పూర్తి చేయాలి
బిల్లులు త్వరగా ఇవ్వాలి
-పోచారం దిశా నిర్దేశం
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ : ఇందిరమ్మ ఇండ్లను త్వరగా జులై మొదటి వారం లోపు పూర్తి చేయాలనీ, అధికారులు ఎప్పటికప్పుడు పనుల పురోగతి ని రికార్డ్ప చేసి లబ్ధిదారులకు బిల్లులు మంజూరు చేయాలని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోపోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. సోమవారం మధ్యాహ్నం పట్టణ కేంద్రంలోని తన నివాసంలో జరిగిన బాన్సువాడ నియోజక స్థాయి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం అధికారులతో సమీక్ష సమావేశంలో ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సమావేశంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, డిప్యూటీ కలెక్టర్ శ్రీమతి కిరణ్మయి, వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ సురేష్ బాబా గారు బిర్కుర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యామల, మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం గంగాధర్, మాజీ ఏ ఎం సి ఛైర్మెన్ నార్ల రవీందర్ గుప్త, మాజీ ఎంపిపి ఎజాజ్, దమారంచ సర్పంచ్ శంకర్, కౌన్సిలర్ హకీమ్, సయ్యద్ ఇలియాస్ అలీ, మొహమ్మద్ గౌస్ వివిధ మండల లా నాయకులు అధికారులు పాల్గొన్నారు.


Post a Comment