👉నలుగురు సభ్యుల ఎంపికకు దరఖాస్తులు
👉అర్హులైన వారు 22 లోపు దరఖాస్తు చేసుకోవాలి: కమిషనర్
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్‌లో ఇద్దరు కో-ఆప్షన్ సభ్యులను, ఇద్దరు మైనారిటీ కో ఆప్షన్ఎ సభ్యులను ఎన్నుకోవడానికి మున్సిపల్ కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. నలుగురిలో ఇద్దరు మహిళలు అయి ఉండాలి.
1. అర్హతలు - ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం ఉన్నవారు:
(ఎ) కామారెడ్డి మున్సిపాలిటీ ఓటరు జాబితాలో రిజిస్టర్ ఓటరు అయి ఉండి, వయస్సు 21 సం|| పైబడి ఉండాలి
(బి) మున్సిపల్ కౌన్సిల్ చైర్ పర్సన్/వైస్ చైర్ పర్సన్/వార్డు మెంబర్ పదవిలో గానీ, గత 5 సం||లలో పని చేసి ఉండకూడదు
(సి) రెవెన్యూ మండల పరిధిలో గ్రామ పంచాయతీ సర్పంచ్/ఉప సర్పంచ్/వార్డు మెంబర్ పదవిలో గానీ, గత 5 సం||లలో పని చేసి ఉండకూడదు
(డి) మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిలర్‌గా 3 సం||లు పని చేసి ఉండకూడదు
(ఇ) కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థల్లో గెజిటెడ్ పోస్ట్‌లో పని చేసి రిటైర్ అయి, మున్సిపల్ పరిపాలనలో అనుభవం ఉన్నవారు అర్హులు
2. అల్ప సంఖ్యాక వర్గాల నుంచి కో-ఆప్షన్ సభ్యుడికి అదనపు అర్హత:
ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, బౌద్ధులు, పార్శీలు (జొరాస్ట్రియన్) వర్గాలకు చెందిన వారు అయి ఉండాలి.
3. దరఖాస్తు వివరాలు:
చివరి తేదీ: 22.04.2026 సాయంత్రం 5:00 గంటల లోపు
ఎక్కడ ఇవ్వాలి: కామారెడ్డి పురపాలక సంఘం కార్యాలయం
సమయం: ఉదయం 10:00 నుంచి సాయంత్రం 5:00 వరకు
4. జతపరచాల్సిన పత్రాలు:
1. దరఖాస్తు పత్రం అభ్యర్థి సంతకంతో
2. ఆధార్ కార్డ్ ప్రతి
3. ఓటరు ఐడీ కార్డ్
4. విద్య, అర్హత సర్టిఫికెట్లు
5. కుల ధృవీకరణ పత్రం
.jpeg)
.jpeg)
Post a Comment