Theft in Post Office Case | భార్యాభర్త (దొంగల)ను పట్టుకున్న పోలీసులు

 

విలేకరుల తో మాట్లాడుతున్న డి ఎస్పీ

👉ఎల్లారెడ్డి పట్టణంలోని సోమార్ పేట్ బేస్ కు చెందిన జంట దొంగలు 

👉బైక్ పై వచ్చి దొంగతనం

👉మూడు రోజుల్లోపే కేసును ఛేధించిన పోలీసులు

👉ఎస్పీ ప్రశంస


           (డీఎస్పీ ప్రెస్ మీట్ వీడియో 👆👆👆)

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరం లో ఉన్న పోస్ట్ ఆఫీసులో గత మూడు రోజుల క్రితం దొంగతనానికి పాల్పడ్డ ఇద్దరు దొంగలను (భార్యా భర్త) పోలీసులు పట్టుకున్నారు. డి ఎస్పీ విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...బాన్సువాడ పట్టణంలో 13న రాత్రి గుర్తు తెలియని దొంగలు బైక్‌పై వచ్చి పోస్ట్ ఆఫీస్‌లో పడుకున్న నైట్ వాచ్‌మెన్ మాతుకూరి సాయిలు ను కత్తితో బెదిరించి, కొట్టి అదుపులోకి తీసుకొని, 2 సెల్ ఫోన్లు, జేబులో ఉన్న 1000 రూపాయలు దోచుకున్నారు. పారిపోతూ పోస్ట్ ఆఫీస్‌కు సంబంధించిన మరో 2 సెల్ ఫోన్లు కూడా దొంగిలించి పోయినారు.  దీంతో వెంటనే స్పందించిన  పోలీసులు Cr.No.169/2026 U/Sec. 309(6) BNS Act కింద కేసు నమోదు చేశారు.  క్రైమ్ పార్టీ బాన్సువాడ, సీసీఎస్ కామారెడ్డి సిబ్బంది మూడు రోజుల్లోనే కేసును ఛేదించారు.  

నిందితులు వీరే:

1. కుర్మా శివకుమార్ తండ్రి పేరు ఆంజనేయ, వయసు 27, కులం: కురుమ, వృత్తి: కూలీ, నివాసము: లొద్ది గల్లీ, సోమవారం పేట్ బెస్, ఎల్లారెడ్డి.  

2. కుర్మా లావణ్య W/o శివకుమార్ వయసు 27, కులం: కురుమ, వృత్తి: కూలీ, నివాసము లొద్ది గల్లీ, సోమర్ పేట్ బెస్, ఎల్లారెడ్డి.  

స్వాధీనం చేసుకున్నవి: దొంగిలించిన మూడు సెల్ ఫోన్లు, వెయ్యి రూపాయలు* స్వాధీనం చేసుకున్నారు.  

మరో కేసులోనూ: ఈ నిందితులు హైదరాబాద్ జెబీఎస్ బస్టాండ్ దగ్గరలో గుడిలో ఉండి పగలగొట్టి దానిలోని డబ్బులు దొంగిలించారు. జెబీఎస్ బస్టాండ్ లో సెల్ ఫోన్లు కూడా దొంగిలించారు. వీటిని కూడా స్వాధీనపర్చుకున్నారు.

జిల్లా ఎస్పీ ప్రశంస:

ఈ కేసును ఛేదించినందుకు  జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కేసును ఛేదించుటలో చాకచక్యంగా పనిచేసిన క్రైమ్ పార్టీ బాన్సువాడ, సీసీఎస్ సిబ్బందిని, శ్రీధర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పి యస్. బాన్సువాడ అభినందించి రివార్డులు ప్రకటించినారు.  

సారాంశం: బాన్సువాడ పోస్ట్ ఆఫీస్‌లో నైట్ వాచ్‌మెన్‌పై దాడి చేసి 2+2=4 సెల్ ఫోన్లు, ₹1000 దోచుకెళ్లిన భార్యాభర్తలను పోలీసులు 3 రోజుల్లో పట్టుకున్నారు. వీరికి హైదరాబాద్‌లో కూడా దొంగతనాల చరిత్ర ఉంది. పోలీసులను ఎస్పీ  అభినందించారు.

Post a Comment

Previous Post Next Post