May Day | ఉత్తమ కార్మికుల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం



•ఉత్తమ కార్మికుల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

•మే డే ఉత్సవాలు

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: ప్రభుత్వ ఆదేశాల మేరకు మే 1 నుంచి మే 10 వరకు జిల్లా స్థాయిలో ‘మే డే’ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు సహాయ కార్మిక కమిషనర్ డా. మున్నం శశికుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి.

*ఉత్తమ కార్మికుల ఎంపిక:*  

పి.ఎఫ్, ఈఎస్ఐ లాంటి విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన ఉద్యోగుల నుంచి, ఉత్తమ నాణ్యత ప్రమాణాలు పాటించే ఫ్యాక్టరీ యజమాన్యాల నుంచి నామినేషన్లు ఆహ్వానిస్తున్నారు.

*ముఖ్యమైన వివరాలు:*

- *దరఖాస్తు చివరి తేదీ:* 27.04.2026  

- *సంప్రదించాల్సిన నంబర్లు:* కామారెడ్డి – 9492555349, బాన్సువాడ – 9703162561  

- *సమర్పించాల్సిన చోటు:* రూమ్ నం. 220, సహాయ కార్మిక కమిషనర్ కార్యాలయం, కలెక్టరేట్, కామారెడ్డి  

వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ పరిశీలించి ఎంపిక చేస్తుంది. మే డే రోజున విజేతలకు అవార్డులు ప్రదానం చేస్తారు.


Post a Comment

Previous Post Next Post