44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
తెలంగాణ డైలీ న్యూస్, నిజామాబాద్ రూరల్-ఆసిఫ్ రిపోర్టర్:
నిజామాబాద్ జిల్లాలో భానుడు రుద్ర ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు భగభగతో జిల్లా ప్రజలు అతలాకుతలమవుతున్నారు. సుమారు 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నాయని వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మధ్యాహ్న సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్లరాదని తెలుపుతున్నారు. ముఖ్యంగా పిల్లలకు, వృద్ధులకు కంటికి రెప్పలా కాపాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

.jpeg)
Post a Comment