తెలంగాణ డైలీ న్యూస్, నిజామాబాద్:
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి, సీపీఎం సీనియర్ నేత నూర్ జహాన్ బేగం ఈ రోజు మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు.
ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు నగరంలోని నామ్ దేవాడాలోని పార్టీ కార్యాలయంలో పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంటలకు ఆమె స్వగ్రామమైన బాన్సువాడలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆమె సోదరుడు ఖలీల్ బాన్స్వాడ లో బిఆరెస్ తరపున మున్సిపల్ కౌన్సిలర్.
నూర్ జహాన్ మృతికి రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర సంతాపం వ్యక్తమవుతోంది. నివాళులు అర్పిస్తున్నారు. ఆమె గతంలో నక్సలైట్ ఉద్యమంతో సంబంధం కలిగి ఉండి, తర్వాత సాధారణ జీవితం గడపాలని ఉద్యమం నుంచి విడిపోయారు. అనంతరం సీపీఎంలో చేరి సీఐటీయూ ద్వారా కార్మిక ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.
CITU District General Secretary Noor Jahan Passes Away
Noor Jahan Begum, District General Secretary of CITU and senior CPM leader, passed away this afternoon. She had been undergoing treatment due to illness for the past few days.
Her mortal remains will be kept for public viewing at the party office in Nam Devada until 6 PM today. The last rites will be performed tomorrow at 12 noon in Banswada.
Political and social circles have expressed deep grief over Noor Jahan’s demise and are paying tributes. She was earlier associated with the Naxalite movement but later quit to lead a normal life. After joining CPM, she played a key role in strengthening the labour movement through CITU.
Post a Comment