రేపు శ్రీ లక్ష్మి హాస్పిటల్ లో ఉచిత పరీక్షలు
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:
కామారెడ్డి పట్టణానికి సంబంధించిన సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్టులకు కామారెడ్డి గోదాం రోడ్ లో గల శ్రీలక్ష్మీ హస్పటల్ను ఏర్పాటు చేసి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఉచిత డయాబెటిక్ పరీక్షలు నిర్వహిస్తామని ఆస్పత్రి డాక్టర్ శ్రవణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని కామారెడ్డి పట్టణ జర్నలిస్టులు వినియోగించుకోవాలని ఆయన కోరారు.
లిమ్రా గార్డెన్స్ కామారెడ్డిలో జరిగే ఈ క్యాంప్లో డయాబెటిక్ పరీక్షల అనంతరం జర్నలిస్టులకు ఆరోగ్య రీత్యా డాక్టర్ తో సలహాలు సూచనలు తీసుకోవాల్సిందిగా డాక్టర్ సూచించారు. ఈ అవకాశాన్ని కామారెడ్డి పట్టణ జర్నలిస్టులు వినియోగించుకోవాలని కోరారు. అనంతరం జర్నలిస్టులకు భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లువారు తెలిపారు.

Post a Comment