Accident in Varni | వర్నిలో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్



(వీడియో 👆)

వర్నిలో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్  

20 మందికి స్వల్ప గాయాలు - వర్ని ఆసుపత్రిలో చికిత్స

తెలంగాణ డైలీ న్యూస్, బాన్స్‌వాడ:

నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని జాకోర చౌరస్తా వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ముందు నుంచి వేగంగా వచ్చిన ఇసుక టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. 


ఘటన వివరాలు:

ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం, టిప్పర్ క్యాబిన్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులు ఒక్కసారిగా కుదుపునకు గురై చేతులు, కాళ్లు, తలకు స్వల్ప గాయాలయ్యాయి. టిప్పర్ డ్రైవర్ కూడా గాయపడినట్లు సమాచారం.

సహాయక చర్యలు:

స్థానికులు వెంటనే స్పందించి బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి, వర్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అందరికీ ప్రథమ చికిత్స అందించారు. అదృష్టవశాత్తు ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని వైద్యులు తెలిపారు.

వర్ని పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






Post a Comment

Previous Post Next Post