గజ్యా నాయక్ తండాలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం
సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభం, లబ్ధిదారులకు బట్టలు పంపిణీ
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి రూరల్: గ్రామంలోని ఆగుల్లా ఎల్లేశం ఇందిరమ్మ ఇంటి నూతన గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్ ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు.
కానుకల పంపిణీ:
ఈ సందర్భంగా సర్పంచ్ వినోద ప్రభాకర్ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు బట్టలు కానుకగా అందజేశారు. గ్రామ పాలకవర్గం తరఫున లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
పాల్గొన్న ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బిక్షపతి, 5వ వార్డు మెంబర్ నరేష్, 6వ వార్డు మెంబర్ ఎజాజ్, కారోబార్ సతీష్, సిబ్బంది మోహన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారుల ఆనందం
ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు మాట్లాడుతూ, "ఎన్నో సంవత్సరాలుగా కిరాయాల ఇళ్లలో ఉంటున్నాం. ఇప్పుడు సొంత ఇల్లు కట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది" అని ఆనందం వ్యక్తం చేశారు. "మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గజ్యా నాయక్ తండా గ్రామపంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు. మీకు ఎల్లవేళలా రుణపడి ఉంటాం" అని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కల నెరవేరుతోందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Post a Comment