Inter Supplementary Exams | ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల


ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల  

మే 13 నుంచి థియరీ పరీక్షలు

మే 22 నుంచి ప్రాక్టికల్స్  

తెలంగాణ డైలీ న్యూస్, హైదరాబాద్:

తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) మే/జూన్ 2026లో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల (IPASE) తాత్కాలిక టైమ్ టేబుల్‌ను శనివారం విడుదల చేసింది. 1st & 2nd ఇయర్ జనరల్ మరియు ఒకేషనల్ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.

ముఖ్య తేదీలు:

థియరీ పరీక్షలు: మే 13 నుంచి మే 21 వరకు  

1st ఇయర్: ఉదయం 9:00 నుంచి 12:00 వరకు  

2nd ఇయర్: మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు  

మే 13న సెకండ్ లాంగ్వేజ్, మే 14న ఇంగ్లీష్, మే 15 నుంచి మే 21 వరకు గ్రూప్ సబ్జెక్టులు జరుగుతాయి.

ప్రాక్టికల్ పరీక్షలు: మే 22 నుంచి మే 25 వరకు  

4 రోజుల పాటు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం 9:00-12:00, మధ్యాహ్నం 2:00-5:00

ఇతర పరీక్షలు:  

మే 26 (మంగళవారం): ఇంగ్లీష్ ప్రాక్టికల్ - 1st ఇయర్ ఉదయం 10:00 నుండి, 2nd ఇయర్ మధ్యాహ్నం 2:00 నుండి. అదే రోజు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష ఉదయం 10:00 నుండి 1:00 వరకు.  

మే 28 (గురువారం): ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఉదయం 10:00 నుండి 1:00 వరకు.

బోర్డు సూచన: ఈ తేదీలు ఒకేషనల్ కోర్సులకు కూడా వర్తిస్తాయని, అయితే ఒకేషనల్ టైమ్ టేబుల్ విడిగా విడుదల చేస్తామని TGBIE స్పష్టం చేసింది. ఇది తాత్కాలిక టైమ్ టేబుల్ మాత్రమేనని, ఫైనల్ టైమ్ టేబుల్ కోసం విద్యార్థులు http://tgbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను చూడాలని సూచించింది.

ఫెయిలైన సబ్జెక్టులు, మార్కులు మెరుగుపరుచుకోవాలనుకునే విద్యార్థులు ఈ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చు. 

Post a Comment

Previous Post Next Post