Tractor Driving By MLA PSR | సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం



సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం

ట్రాక్టర్ నడుపుతూ ప్రగతిపై సమీక్ష 

తెలంగాణ డైలీ న్యూస్,వర్ని:

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు.

సుమారు రూ. 120 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ రిజర్వాయర్ పనుల ప్రగతిని అంచనా వేసేందుకు ఎమ్మెల్యే స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.(video 👇)



ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రిజర్వాయర్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, ఎలాంటి అలసత్వం వహించవద్దని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

"సిద్దాపూర్ రిజర్వాయర్ పూర్తయితే ఈ ప్రాంతంలోని గిరిజన రైతులకు సాగు, తాగు నీటి సమస్య తీరుతుంది. వేల ఎకరాలకు సాగునీరు అంది భూములు సస్యశ్యామలం అవుతాయి. స్థానిక గిరిజనులకు ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగకరం" అని పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

ఎమ్మెల్యే వెంట ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post