Top News

No Tobacco Day | పొగాకుతో క్యాన్సర్ ముప్పు: ఐడీఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ అచుకట్ల జీవన్


ప్రపంచ నో టొబాకో డే సందర్భంగా దంత వైద్యుల భారీ ర్యాలీ 

సిగరెట్ దిష్టిబొమ్మ దహనం - దురలవాట్లు మానుకోవాలని పిలుపు  

పొగాకుతో క్యాన్సర్ ముప్పు: ఐడీఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ అచుకట్ల జీవన్ 

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: ఇండియన్ డెంటల్ అసోసియేషన్ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ నో టొబాకో డే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాకు చెందిన దంత వైద్యులు భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీ నిర్వహించారు.  

ఈ ర్యాలీ నిజాంసాగర్ చౌరస్తా నుండి ప్రారంభమై మున్సిపల్ ఆఫీస్ మీదుగా తిరిగి నిజాంసాగర్ చౌరస్తా వద్దకు చేరుకుంది. అక్కడ సిగరెట్ దిష్టిబొమ్మను దహనం చేసి కార్యక్రమాన్ని ముగించారు.  

ఈ సందర్భంగా ఐడీఏ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ 

అచుకట్ల జీవన్ మాట్లాడుతూ, పొగాకు, గుట్కా, సిగరెట్ అలవాట్ల బారిన పడి యువకులు తమ జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దురలవాట్ల వల్ల ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారని, వెంటనే వాటిని మానుకోవాలని విజ్ఞప్తి చేశారు.  

ఈ కార్యక్రమంలో ఐడీఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లికార్జున్, రాష్ట్ర బాధ్యులు డాక్టర్ సాజిద్, కామారెడ్డి జిల్లా కోశాధికారి డాక్టర్ కవిత, డాక్టర్ వినోద్, డాక్టర్ ప్రవీణ్‌తో పాటు జిల్లాకు చెందిన దంత వైద్యులు పాల్గొన్నారు.







Post a Comment

Previous Post Next Post