పేకాట స్థావరంపై పోలీసుల దాడి - ఏడుగురు అరెస్ట్
రూ. 18,020 నగదు, 4 బైక్‌లు, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం
ముక్కలాట ఆడుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: బాన్సువాడ మండలం తాడుకోల్ గ్రామ పరిధిలోని కొయ్య గుట్ట తండా శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో 10 నంబర్ కెనాల్ పక్కన షేక్ ఇబ్రహీం నివాసం, రాజారాం దుబ్బ, తాడుకోల్ గ్రామం వద్ద ముక్కలాట ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు.
ఈ దాడిలో రాజారం దుబ్బ, తాడుకోల్ గ్రామానికి చెందిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా డబ్బులు పెట్టి మూడు ముక్కలాట ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుల నుంచి రూ. 18,020 నగదు, నాలుగు మోటార్ సైకిళ్లు, ఏడు సెల్‌ఫోన్లు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
(Video👆)
Post a Comment