Police Awareness | నాగిరెడ్డిపేట బస్టాండ్‌లో పోలీస్ కళాబృందం అవగాహన





 నాగిరెడ్డిపేట బస్టాండ్‌లో పోలీస్ కళాబృందం అవగాహన కార్యక్రమం  

సైబర్ నేరాలు, వేసవి జాగ్రత్తలు, రోడ్డు భద్రతపై ప్రజలకు సూచనలు  

తెలంగాణ డైలీ న్యూస్, నాగిరెడ్డిపేట: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట బస్టాండ్ ఆవరణలో సోమవారం పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు

కామారెడ్డి జిల్లా ఎస్పీ  ఎం.రాజేష్ చంద్ర ఆదేశానుసారం, నాగిరెడ్డిపేట ఎస్‌ఐ  ఐ.ఏ.భార్గవ్ గౌడ్ గ సూచన మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.  

సైబర్ నేరాలు, ఓటీపీ మోసాలపై అవగాహన  

సైబర్ నేరాల బారిన పడితే టోల్ ఫ్రీ నంబర్ 1930కు కాల్ చేయాలని, ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దని సూచించారు. అత్యవసర సమయంలో డయల్ 100కు కాల్ చేయాలని, మహిళల రక్షణ కోసం షీ టీమ్ టోల్ ఫ్రీ నంబర్ 872686094 అందుబాటులో ఉందని తెలిపారు.  

వేసవి జాగ్రత్తలు, రోడ్డు భద్రతపై సూచనలు  

వేసవి కాలంలో దొంగతనాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, చిన్న పిల్లలు సెలవుల్లో ఈతకు వెళ్లి ప్రమాదాల బారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని హెచ్చరించారు.  

మాటలు, పాటల ద్వారా అవగాహన  

పోలీస్ కళాబృందం ఇన్‌చార్జి హెడ్ కానిస్టేబుళ్లు రామంచ తిరుపతి, శేషరావు, పోలీస్ కానిస్టేబుళ్లు ప్రభాకర్, సాయిలు మాటలు, పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.  

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి షీ టీమ్ పీసీ శ్రీశైలం, డబ్ల్యూసీపీ సుప్రజా, పీసీ శ్రీనివాస్, వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post