Top News

Atma Committee Oath Ceremony | రైతుల కోసం చిత్త శుద్ధితో పని చేయాలి : పోచారం

రైతుల కోసం చిత్త శుద్ధితో పని చేయాలి : పోచారం 

బాన్సువాడలో ఆత్మ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం  

ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు  

బాన్సువాడ: బాన్సువాడ పట్టణ కేంద్రంలోని అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కార్యాలయంలో సోమవారం  ఆత్మ కమిటీ చైర్మన్,  సభ్యుల పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.  

ఎమ్మెల్యే పోచారం హాజరు  

ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు  పోచారం శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్  కాసుల బాలరాజు గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  

నూతన చైర్మెన్‌గా మాసాని రవీందర్ రెడ్డి  

ఆత్మ కమిటీ చైర్మన్‌గా శ్రీ మాసాని రవీందర్ రెడ్డి, కమిటీ సభ్యులు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యే పోచారం శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ఆత్మ కమిటీ చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ, గ్రామీణ మండల, బీర్కూర్, నసురుల్లాబాద్ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.







Post a Comment

Previous Post Next Post