ఏసీబీ వలలో పాలకుర్తి ఇరిగేషన్ డీఈ
రూ.50 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ గంటి శ్రీకాంత్
డబుల్ బెడ్ రూమ్ బిల్లుల కోసం లంచం డిమాండ్
2022 నుంచి పెండింగ్‌లో బిల్లులు
తెలంగాణ డైలీ న్యూస్, హనుమకొండ: హనుమకొండ జిల్లా భవానీ నగర్‌లో ఏసీబీ అధికారులు చేపట్టిన దాడుల్లో ఇరిగేషన్ డీఈ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
డబుల్ బెడ్ రూమ్ బిల్లుల కోసం లంచం డిమాండ్
పాలకుర్తి ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గంటి శ్రీకాంత్ రూ.50,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ వరంగల్ రేంజ్ అధికారులు పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడు నిర్మించిన 10 డబుల్ బెడ్ రూమ్ (2BHK) ఇండ్లకు సంబంధించిన తుది కొలతలను ఎం-బుక్స్‌లో నమోదు చేసి బిల్లులు ప్రాసెస్ చేయడానికి డీఈ లంచం డిమాండ్ చేశారు.
2022 నుంచి పెండింగ్‌లో బిల్లులు
ఫిర్యాదుదారుడు నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల బిల్లులను సెప్టెంబర్ 2022 నుంచి డీఈ శ్రీకాంత్ పెండింగ్‌లో పెట్టారు. అధికారిక లబ్ధి కోసం రూ.50,000 లంచం డిమాండ్ చేసి తన నివాసం భవానీ నగర్, హనుమకొండలో తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
లంచం సొమ్ము స్వాధీనం, అరెస్ట్
నిందితుడి వద్ద నుంచి లంచం సొమ్ము రూ.50,000 స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అక్రమంగా లబ్ధి పొందేందుకు విధులను సక్రమంగా నిర్వర్తించలేదని ఏసీబీ తెలిపింది. నిందితుడిని అరెస్ట్ చేసి వరంగల్ ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. భద్రతా కారణాలతో ఫిర్యాదుదారుని వివరాలు వెల్లడించలేదు.

Post a Comment