Police Raid | కామారెడ్డిలో జూద స్థావరంపై పోలీసుల దాడి

జూదరులను అరెస్ట్ చేసిన పోలీసులు

కామారెడ్డిలో జూద స్థావరంపై పోలీసుల దాడి  

రాఘవపూర్ శివారులో 9 మంది అరెస్ట్, రూ.73,110 నగదు స్వాధీనం  

చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఉక్కుపాదం: ఎస్పీ రాజేష్ చంద్ర

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: జిల్లాలో పేకాట, చిత్తు బొత్తులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవపూర్ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం సి.సి.ఎస్ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు.

చిత్తు బొత్తు ఆడుతున్న ముఠాను అదుపులోకి తీసుకొని 9 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి చిత్తు బొత్తు కాయిన్స్, రూ.73,110 నగదు, 2 మోటార్ సైకిళ్లు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జూదం వల్ల వ్యక్తులు కష్టార్జితాన్ని కోల్పోయి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని పోలీసులు తెలిపారు. ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లాలో ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయి.

జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర  మాట్లాడుతూ, పేకాట, చిత్తు బొత్తు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఇలాంటి చర్యల్లో పాల్గొనే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రజలు చట్టాన్ని గౌరవించి శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు. ఎవరైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే డయల్ 100 లేదా సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.

Post a Comment

Previous Post Next Post