Top News

Red Cross Society | మే 15 నుండి జూన్ 16 వరకు రెడ్ క్రాస్ సొసైటీ ప్రత్యేక సభ్యత్వ నమోదు డ్రైవ్


•మే 15 నుండి జూన్ 16 వరకు రెడ్ క్రాస్ సొసైటీ ప్రత్యేక సభ్యత్వ నమోదు డ్రైవ్  

•కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పిలుపు  

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశాల మేరకు, గవర్నర్  శివ ప్రతాప్ శుక్లా సూచనలు, గవర్నర్ కార్యదర్శి  దానకిషోర్ ఉత్తర్వుల ప్రకారం జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరం చేయడం జరిగింది. 

మే 15 నుండి జూన్ 16 వరకు స్పెషల్ డ్రైవ్  

ఇందులో భాగంగా జిల్లాలో మే 15 నుండి జూన్ 16 వరకు ప్రత్యేక సభ్యత్వ నమోదు డ్రైవ్ (Special Membership Drive) నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ప్రత్యేక సభ్యత్వ నమోదు డ్రైవ్‌ను సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)  ఎస్.వై. గిరిని రెడ్ క్రాస్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్, స్పెషల్ ఆఫీసర్‌గా, ఆరోగ్య శాఖ సహాయ కమిషనర్ డాక్టర్ శశి కుమార్ గారిని జిల్లా నోడల్ ఆఫీసర్‌గా జిల్లా కలెక్టర్ నియమించారు.

అధికారులు, ప్రజల భాగస్వామ్యం 

జిల్లాలోని అన్ని శాఖల జిల్లా అధికారులు తమ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ ప్రత్యేక డ్రైవ్ వ్యవధిలోనే తప్పనిసరిగా సభ్యత్వం తీసుకునేలా చూడాలని కోరారు. సాధారణ ప్రజలు, వైద్యులు మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా మే 15 నుండి జూన్ 16 వరకు జరిగే ఈ ప్రత్యేక డ్రైవ్‌లో పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఈ సేవా సంస్థలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఆన్‌లైన్‌లో నమోదు వివరాలు

ఈ ప్రక్రియ కోసం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నోడల్ రిజిస్ట్రేషన్ కేంద్రంగా పనిచేస్తుందని, ఆసక్తి గల వారు నేరుగా కలెక్టరేట్‌లో లేదా https://redcross.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా మరియు "TELANGANA RED CROSS" మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. పాట్రన్, వైస్ పాట్రన్, లైఫ్ మెంబర్, లైఫ్ అసోసియేట్, సంవత్సర చందాతో కూడా డిజిటల్ చేరువని తెలిపారు. 

సేవా కార్యక్రమాల విస్తరణే లక్ష్యం

ఈ డ్రైవ్ కాలంలో యువతపై ప్రత్యేక దృష్టి సారించి, జిల్లా వ్యాప్తంగా రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలను విస్తృతం చేసే ఉద్దేశంలో ఉన్న వారికి అండగా నిలవాలని అందరికీ ఈ సందర్భంగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

Post a Comment

Previous Post Next Post