గురువులా... మార్కెట్ ప్రతినిధులా !?
అడ్మిషన్ల కోసం ఉపాధ్యాయులపై ఒత్తిడి ఆపాలి
(తెలంగాణ డైలీ న్యూస్-ప్రత్యేక వ్యాసం)
పాఠశాలల ఉపాధ్యాయులను అడ్మిషన్ల కోసం ఇంటింటికి తిరిగే పరిస్థితి కల్పించడం చాలా బాధాకరం. విద్యాబోధన చేయాల్సిన గురువులను మార్కెటింగ్ ప్రతినిధుల్లా ఉపయోగించడం విద్యా వ్యవస్థ గౌరవాన్ని తగ్గించే చర్య.
ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం. కానీ ప్రస్తుతం వారికి బోధనకు సంబంధం లేని పనులు అప్పగించడం వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. అడ్మిషన్ల కోసం ఇంటింటికి తిరగమని ఒత్తిడి చేయడం ద్వారా గురువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు.
సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన గురువుల గౌరవాన్ని నేడు కొన్ని యాజమాన్యాలు, అధికారులు కాలరాస్తున్నారు.
క్లాస్‌రూమ్‌లో ఉండి విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు ఇప్పుడు అడ్మిషన్ల కోసం వీధుల్లో తిరగాల్సిన పరిస్థితి రావడం విద్యా వ్యవస్థ పతనానికి నిదర్శనం.
విద్యను వ్యాపారంగా మార్చి, అడ్మిషన్ల కోసం గురువులపై ఒత్తిడి తీసుకురావడం సిగ్గుచేటు.
ఇది కేవలం ఉపాధ్యాయుల అవమానం మాత్రమే కాదు, మొత్తం విద్యా వ్యవస్థకు మచ్చ.
గురువుల గౌరవాన్ని కాపాడాలి...విద్యను వ్యాపారంగా మార్చడం ఆపాలి...ఉపాధ్యాయులను అడ్మిషన్ ఏజెంట్లలా ఉపయోగించడం వెంటనే నిలిపివేయాలి...
దయచేసి తల్లి తండ్రులు గురువులను ఏజెంట్లుగా మార్చే స్కూళ్ళలో తమ పిల్లలను చేర్పించవద్దని మనవి....
✍️సన్నీ కుమార్ రాపాక (రచయిత)
సామాజిక వేత్త, ఫౌండర్ చైర్మన్, అక్షిత ఫౌండేషన్
సెల్ : 90000 57307

Post a Comment