Top News

CPI | పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి:

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి:

 సిపిఐ నేత దుబాస్ రాములు డిమాండ్

తెలంగాణ డైలీ న్యూస్,  బాన్సువాడ:

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం సరైన పద్ధతి కాదని సిపిఐ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జ్ దుబాస్ రాములు పేర్కొన్నారు. శనివారం నాడు బాన్సువాడ  పట్టణ కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌ను ఉద్దేశించి  మాట్లాడుతూ  ధరల పెంపుతో నిత్యవసర సరకుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని, ఫలితంగా ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారని ఆయన తెలిపారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రెస్ మీట్‌లో దర్శన్ మేస్త్రి, ఉమాకాంత్, సుభాష్, శంకర్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.



Post a Comment

Previous Post Next Post