జిల్లాలో ఒకే రోజు రెండు ఆత్మహత్య ఘటనలు
సింగితం, కొల్లూర్ గ్రామాల్లో ఇద్దరి ఆత్మహత్యలు
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:
జిల్లాలో ఆదివారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు ఉరివేసుకొని మృతి చెందిన విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి.
1. కొల్లూరు ఘటన:
కొల్లూరు గ్రామ శివారులోని సబ్‌స్టేషన్ ఎదురుగా గల మొరం దుబ్బ ప్రాంతంలో బండారి సాయిలు అలియాస్ బొంబాయి సాయిలు (48) ఉరివేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. భార్య బండారి సుశీల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక తర్వాత తెలుస్తాయని పోలీసులు తెలిపారు.
2. సింగీతం ఘటన:
నిజాంసాగర్ మండలం సింగీతం గ్రామ శివారులోని ఎల్లయ్య చెరువు సమీపంలో మందుల శ్రీనివాస్ (48) వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గత ఐదు సంవత్సరాలుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న శ్రీనివాస్, అనారోగ్యంతో మనస్తాపం చెంది ఈ చర్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య మందుల లక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రెండు ఘటనల్లోనూ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల విచారణ కొనసాగుతోంది.


Post a Comment