Top News

Gas Leak in Home | ఒకే కుటుంబంలో ముగ్గురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు

కామారెడ్డి గ్యాస్ లీక్ ప్రమాదం  

వినాయక్‌నగర్ కాలనీలో గ్యాస్ సిలిండర్ లీక్‌తో అగ్నిప్రమాదం  

ఒకే కుటుంబంలో ముగ్గురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు  

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు  

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని వినాయక్‌నగర్ కాలనీలో బుధవారం గ్యాస్ సిలిండర్ లీక్ కారణంగా ఒక ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. 

వంట గ్యాస్ లీకై ప్రమాదం  

ఓ ఇంట్లో వంట గ్యాస్ లీకవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పే క్రమంలో ఒకే కుటుంబానికి చెందిన మల్లవ్వ, మౌనిక, అలేఖ్య అనే ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులను అక్కడి నుంచి బయటకు తీసుకువచ్చారు.  

ఆసుపత్రిలో చికిత్స  

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను హుటాహుటిన కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.  

స్థానికుల ఆందోళన  

సిలిండర్ పేలి ఉంటే పెను ప్రమాదం సంభవించేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

Previous Post Next Post