TUWJ (IJU) Conference | సమాజ సేవలో జర్నలిస్టులు : ఎమ్మెల్యే కేవీఆర్

కామారెడ్డిలో టియుడబ్ల్యూజే ఐజేయూ జిల్లా స్థాయి తృతీయ మహాసభ 

సమాజ సేవలో జర్నలిస్టులు : ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి  

ప్రభుత్వం ఇవ్వకుంటే సొంత నిధులతో జర్నలిస్టులకు ప్లాట్లు : ఎమ్మెల్యే హామీ  

ఉద్యోగులతో సమానంగా జర్నలిస్ట్ లకు హెల్త్ కార్డులు ఇవ్వాలి: విరాహత్ అలీ డిమాండ్

తెలంగాణ డైలీ న్యూస్ ప్రతినిధి, కామారెడ్డి, జూన్ 12: కామారెడ్డి పట్టణంలోని వరలక్ష్మి గార్డెన్‌లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ - ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (టియుడబ్ల్యూజే ఐజేయూ) జిల్లా స్థాయి తృతీయ మహాసభ శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ మహాసభకు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.  

ఎమ్మెల్యే ప్రసంగం

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, జర్నలిస్టులు సమాజ సేవ కోసమే పని చేస్తారని, సమాజంలో జరుగుతున్న చెడును వెలికితీయడానికి నిరంతరం కృషి చేస్తారని అన్నారు. జర్నలిజం నాన్ ప్రాఫిటబుల్ వృత్తి అని, రాజకీయాలు కలుషితం అయ్యాయని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు తప్పులు చేస్తే వాటిపై వార్తలు రాయాలని, కానీ ఎన్నికల సమయంలో ప్యాకేజీల కోసం పొగడకూడదని సూచించారు.  

తాను జడ్పీ చైర్మన్‌గా ఉన్నప్పుడు పాత్రికేయుల సహకారంతోనే అనేక సమస్యలు పరిష్కరించగలిగానని గుర్తు చేశారు. నేడు వందల సంఖ్యలో పత్రికలు, యూట్యూబ్ ఛానళ్లు రావడంతో ఏ వార్త నిజమో, ఏది అబద్ధమో తెలియని పరిస్థితి ఉందన్నారు. కామారెడ్డిలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల మంజూరు కోసం కృషి చేస్తామని, ప్రభుత్వం మంజూరు చేయకపోతే తన సొంత నిధులతో జర్నలిస్టులకు ప్లాట్లు అందజేస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఎప్పుడూ అండగా ఉంటానని తెలిపారు.  

రాష్ట్ర అధ్యక్షుడి ప్రసంగం  

మహాసభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న టియుడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లాతో తనకు 35 ఏళ్ల అనుబంధం ఉందని తెలిపారు. ఇక్కడ జర్నలిస్టులకు అన్యాయం జరిగితే వచ్చి పోరాడిన చరిత్ర తమ సంఘానికి ఉందన్నారు. మల్లెపూల నరేందర్‌పై కాల్పులు జరిగినప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన చేసి అన్యాయాన్ని అడ్డుకున్నామని గుర్తు చేశారు.  

తమ సంఘానికి 70 ఏళ్ల చరిత్ర ఉందని అన్నారు. పత్రిక యాజమాన్యాలు జర్నలిస్టుల పట్ల వివక్ష చూపుతున్నాయని విమర్శించారు. ఇప్పటికీ జర్నలిస్టులను స్ట్రింగర్లుగా పరిగణిస్తున్నారని, గ్రామీణ జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పారు. నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులకు తమ సంఘం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, అవినీతికి పాల్పడే వారికి సహకరించబోమని స్పష్టం చేశారు.  

ప్రధాన డిమాండ్లు  :

1. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలి.  

2. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 100% ఫీజు రాయితీతో ప్రవేశం కల్పించాలి.  

3. జర్నలిస్టుల సంక్షేమ పథకాలను మేనిఫెస్టోలో చేర్చి అమలు చేయాలి.  

ఈ డిమాండ్లతో అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు అందించామని రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు. కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు రజనీకాంత్ జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.  







సంతాప తీర్మానం  

ఇటీవల ఉమ్మడి జిల్లాలో, అలాగే రాష్ట్రంలో మృతి చెందిన జర్నలిస్టులకు సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు.

TUWJ జిల్లా నివేదిక సమర్పణ

కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు రజనీకాంత్ జిల్లా నివేదికను సమర్పించారు.

2026-28 నూతన కార్యవర్గాల ఏకగ్రీవ ఎన్నిక  

ఎన్నికల అధికారి లస్కర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి.  

TUWJ IJU జిల్లా కార్యవర్గం

అధ్యక్షులు: రజనీకాంత్  

ఉపాధ్యక్షులు: సయ్యద్ కౌసర్, ఎండి అబిద్, ముధం శంకర్, యు. బాలయ్య, ఎండి యూనుస్  

కార్యదర్శి: రాజేష్  

సహాయ కార్యదర్శులు: శ్రీనివాస్ రెడ్డి, సాయి ప్రసాద్, కే. శ్రీనివాసరావు, యు. రామకృష్ణ, లక్ష్మీనారాయణ  

కోశాధికారి: వెంకటేశ్వర్లు  

కార్యవర్గ సభ్యులు: శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, ఇ. శ్రీనివాస్, కే. గంగాధర్, జై బాల ప్రకాష్, ఎండి వాజిద్, సుభాష్, జి. శ్రీనివాస్, మేకల రవి, భవాని  

ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యవర్గం  

అధ్యక్షులు: పి. శ్రీనివాస్  

ఉపాధ్యక్షులు: పి. రాజేష్ కుమార్, శంభు లింగం, అబ్దుల్ సలీం, ఎండి అబ్దుల్ సలీం  

కార్యదర్శి: బి. సుధాకర్ గౌడ్  

ఆర్గనైజింగ్ సెక్రటరీ: ఏ. మాజీద్  

సహాయ కార్యదర్శులు: రామేశ్వరరావు, ఎన్. సాయిరాం, జై వీరయ్య, రవీందర్ గౌడ్  

కోశాధికారి: జి. సత్యనారాయణ గౌడ్  

కార్యవర్గ సభ్యులు: ఆశన్న, ఎండి రజాక్, పోచయ్య, గంగాధర్, బన్సీలాల్, మంగపాల్, దినాకర్, ప్రవీణ్  

ప్రమాణ స్వీకారం & తీర్మానాలు 

రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన కార్యవర్గాలు సమావేశమై పలు తీర్మానాలు, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకున్నాయి.

ముఖ్య అతిథి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, విశిష్ట అతిథులు, గౌరవ అతిథులను సన్మానించారు.

హాజరైన ప్రముఖులు

కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, కౌన్సిలర్లు,  రాష్ట్ర కార్యదర్శి రాం నారాయణ, TUWJ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.ఏ. లతీఫ్, సీనియర్ జర్నలిస్టులు లస్కర్ సత్యనారాయణ, ఇంద్రసేనారెడ్డి, కౌసర్, మొయినుద్దీన్, చందు, అహ్మద్, జిల్లాలోని పాత్రికేయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




Post a Comment

أحدث أقدم