టీయూడబ్ల్యూజే కామారెడ్డి జిల్లా కార్యవర్గ ఎన్నికల షెడ్యూల్ విడుదల
గురువారం నామినేషన్లు.. 12న ఎన్నిక, సర్వసభ్య సమావేశం
ఎన్నికల అధికారి లస్కర్ సత్యనారాయణ
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) కామారెడ్డి జిల్లా శాఖ కార్యవర్గ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల అధికారి లస్కర్ సత్యనారాయణ విడుదల చేశారు.
ఎన్నికల షెడ్యూల్:
- నామినేషన్ల స్వీకరణ: 11-06-2026 గురువారం ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు. వేదిక: టీయూడబ్ల్యూజే కార్యాలయం, వీక్లీ మార్కెట్ రోడ్, కామారెడ్డి.
- స్క్రూటినీ: 11-06-2026 మధ్యాహ్నం 3:00 నుండి 4:00 గంటల వరకు.
- పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటన: 11-06-2026
- నామినేషన్ ఉపసంహరణ: 11-06-2026 నుండి 12-06-2026 వరకు
- ఎన్నికల నిర్వహణ: 12-06-2026 మధ్యాహ్నం 3:00 నుండి 4:00 గంటల వరకు. వేదిక: వరలక్ష్మి గార్డెన్, అశోక్ నగర్ కాలనీ, కామారెడ్డి.
పదవులు - నామినేషన్ ఫీజు:
అధ్యక్షుడు - రూ.3,000 (1 పదవి), కార్యదర్శి - రూ.3,000 (1 పదవి), కోశాధికారి - రూ.3,000 (1 పదవి), ఉపాధ్యక్షులు - రూ.2,000 (3 పదవులు), సహాయ కార్యదర్శులు - రూ.2,000 (3 పదవులు), కార్యవర్గ సభ్యులు - రూ.1,000 (11 పదవులు).
ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గానికి కూడా నామినేషన్లు స్వీకరిస్తామని ఎన్నికల అధికారి తెలిపారు.
ముఖ్య నిబంధనలు:
1. ఓటర్ లిస్టులో పేరు ఉన్నవారికే పోటీ చేసే అర్హత ఉంటుంది.
2. ఒక అభ్యర్థికి ముగ్గురు ప్రపోజల్ చేయాలి. ఒకరికి ప్రపోజల్ చేసిన వారు ఇతరులకు ప్రపోజల్ చేస్తే నామినేషన్ తిరస్కరిస్తారు.
3. పోటీ చేస్తున్న వారు ఇతరులకు ప్రపోజల్ చేయరాదు. ప్రపోజల్ చేసిన వారు ఇతర ఏ పోస్టులకు అర్హులు కారు.
4. ఒక అభ్యర్థి ఎన్ని పోస్టులకైనా నామినేషన్ వేయవచ్చు. కానీ చివరికి ఒక పోస్టుకు మాత్రమే పోటీలో ఉండాలి. మిగతా నామినేషన్లు ఉపసంహరించుకోవాలి.
5. నామినేషన్ ఫీజు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఇవ్వబడదు.
6. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి వ్యక్తిగత దుష్ప్రచారం చేయరాదు.
7. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని విషయాలలో ఎన్నికల అధికారికి సర్వాధికారాలు కలవు. ఎన్నికల అధికారి నిర్ణయం అంతిమంగా పరిగణించబడుతుంది.
టీయూడబ్ల్యూజే అర్హులైన సభ్యులందరూ ఎన్నికల ప్రక్రియలో పాల్గొని విజయవంతం చేయాలని ఎన్నికల అధికారి లస్కర్ సత్యనారాయణ కోరారు.
అవసరమైతే ఎన్నికల నిర్వహణ, తుది ఫలితాల వెల్లడి ఈనెల 12న కామారెడ్డి అశోక్ నగర్‌లోని వరలక్ష్మి గార్డెన్‌లో జరిగే జిల్లా సాధారణ సర్వసభ్య సమావేశంలో సాయంత్రం ఉంటుందని తెలిపారు.
టీయూడబ్ల్యూజే సభ్యులు నామినేషన్లు దాఖలు చేసి ఎన్నికల్లో పాల్గొనాలని ఎన్నికల అధికారి సత్యనారాయణ కోరారు.


Post a Comment