Top News

పాఠశాల నుండి కనిపించకుండా పోయిన 10 ఏళ్ల బాలుడు సురక్షితంగా రక్షణ

 

రెండు గంటల్లోనే అదృశ్యమైన విద్యార్థిని గుర్తించిన భిక్నూర్ పోలీసులు  

ఎస్పీ ఆదేశాలతో రెండు ప్రత్యేక బృందాల గాలింపు  

పాఠశాల నుండి కనిపించకుండా పోయిన 10 ఏళ్ల బాలుడు సురక్షితంగా రక్షణ  

త్వరిత చర్యలపై పోలీసు బృందాన్ని అభినందించిన ఎస్పీ

భిక్నూర్: భిక్నూర్ మండలంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల నుండి ఉదయం కనిపించకుండా పోయిన విద్యార్థిని పోలీసులు కేవలం రెండు గంటల్లోనే గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.

ఫిర్యాదు అందగానే రంగంలోకి పోలీసులు  

ఈరోజు మధ్యాహ్నం 12.00 గంటలకు టిఎస్‌డబ్ల్యూఆర్ఎస్ భిక్నూర్ ప్రిన్సిపాల్ సాబావత్ రఘు పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. 5వ తరగతి చదువుతున్న కమ్మరిపల్లి రుత్విక్, తండ్రి రాజు, వయస్సు 10 సంవత్సరాలు, నివాసం పెద్దమల్లారెడ్డి గ్రామం. ఉదయం 9.15 గంటల ప్రార్థన అనంతరం బాలుడు కనిపించకుండా పోయాడని తెలిపారు.

ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు  

విషయాన్ని సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాలతో కామారెడ్డి డిఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో భిక్నూర్ సిఐ నరేష్ రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పాఠశాల చుట్టుపక్కల ప్రాంతాలు, సమీప గ్రామాలు, ప్రధాన రహదారులు, బస్ స్టాండ్లు అన్ని చోట్లా గాలింపు చేపట్టారు.

రెండు గంటల్లో సురక్షితంగా రక్షణ  

పోలీసుల వేగవంతమైన చర్యలతో విద్యార్థి కనిపించకుండా పోయిన రెండు గంటల వ్యవధిలోనే బాలుడిని గుర్తించారు. సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు, పాఠశాల యాజమాన్యానికి అప్పగించారు.

పోలీసు బృందంపై ప్రశంసలు  

ఇంత త్వరగా బాలుడిని గుర్తించిన భిక్నూర్ పోలీసు బృందం పనితీరును ఎస్పీ రాజేష్ చంద్ర, డిఎస్పీ మధుసూదన్ అభినందించారు.

ఈ సందర్భంగా భిక్నూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మాట్లాడుతూ, పిల్లలు లేదా కుటుంబ సభ్యులు కనిపించకుండా పోతే ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. తక్షణ సమాచారం ఉంటే పోలీసులు వేగంగా స్పందించి సురక్షితంగా గుర్తించే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

Post a Comment

Previous Post Next Post