Top News

ACB Raid | లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ AE

 


శ్మశానవాటిక బిల్లు కోసం రూ.2 లక్షల డిమాండ్  

లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ AE  

 ఇంట్లో సోదాల్లో రూ.32.31 లక్షల అక్రమ నగదు లభ్యం

 ఏసీబీ అధికారుల సోదాల్లో భారీగా అక్రమాస్తులు

పెద్దపల్లి  : పెద్దపల్లి జిల్లా మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ కల్లేపల్లి సతీష్ కుమార్ (33)ను రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ - ఏసీబీ కరీంనగర్ యూనిట్ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, పెద్దపల్లి పట్టణంలోని తెనుగువాడ హిందూ శ్మశానవాటిక మరియు కునారం రోడ్డులోని హిందూ శ్మశానవాటిక అభివృద్ధి పనులకు సంబంధించి రూ.12,28,748 విలువైన కాంట్రాక్ట్ తుది బిల్లు ఉంది. ఆ బిల్లును TUFIDC, హైదరాబాద్‌కు ప్రాసెస్ చేసి పంపిస్తానని చెప్పి ఫిర్యాదుదారుడి నుంచి సతీష్ కుమార్ రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. డబ్బు తీసుకుంటుండగానే ఏసీబీ అధికారులు అతడిని పట్టుకున్నారు. వీడియో 👇


ఇంట్లో సోదాలు - రూ.32 లక్షలకు పైగా నగదు  

నిందితుడి వద్ద నుంచి లంచం మొత్తం రూ.2 లక్షలను స్వాధీనం చేసుకున్న అధికారులు, అనంతరం అతడి నివాసంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో లెక్కల్లో చూపని రూ.32,31,900 నగదును స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన అధికారులు, కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు తెలిపారు.

Post a Comment

Previous Post Next Post