Top News

BJP Labour Cell DP | బీజేపీ కార్మిక విభాగం కామారెడ్డి జిల్లా కన్వీనర్‌గా నాయిని మహిపాల్ యాదవ్ నియామకం

బీజేపీ కార్మిక విభాగం కామారెడ్డి జిల్లా కన్వీనర్‌గా నాయిని మహిపాల్ యాదవ్ నియామకం

రాష్ట్ర కార్మిక విభాగ అధ్యక్షులు అందే శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ  

పార్టీ పటిష్టత, కార్మిక సంక్షేమమే లక్ష్యం :మహిపాల్ 

కామారెడ్డి: భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం కామారెడ్డి జిల్లా కన్వీనర్‌గా నాయిని మహిపాల్ యాదవ్ ను నియమిస్తూ రాష్ట్ర కార్మిక విభాగ అధ్యక్షులు అందే శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన నియామక పత్రంలో, పార్టీ పట్ల నిబద్ధత, సేవా దృక్పథం, కార్మికుల సంక్షేమం కోసం పనిచేసే తత్వాన్ని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు అందే శ్రీనివాస్ తెలిపారు. 

నాయిని మహిపాల్ యాదవ్ సమాజానికి అందించిన సేవలు, నిజాయితీ, క్రమశిక్షణను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆయన తనకు అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వహిస్తూ, కార్మిక విభాగ బలోపేతానికి, పార్టీ పటిష్టతకు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు.

నూతన జిల్లా కన్వీనర్‌గా నియమితులైన నాయిని మహిపాల్ యాదవ్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశం కల్పించినందుకు బీజేపీ రాష్ట్ర కార్మిక విభాగ అధ్యక్షులు అందే శ్రీనివాస్‌కు ధన్యవాదాలు తెలిపారు. 

అదేవిధంగా ఈ నియామకానికి సహకరించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి రాంరెడ్డి, పైడి ఎల్లారెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి తదితర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

కార్మికుల సంక్షేమం కోసం పార్టీ ఆదేశాల మేరకు పని చేస్తానని, కార్మిక విభాగాన్ని జిల్లాలో మరింత బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక విభాగ అధ్యక్షులు అందే శ్రీనివాస్, పార్టీ నాయకులు, పదాధికారులు, కార్యకర్తలు నూతన కన్వీనర్‌కు పూర్తి సహకారం అందించాలని కోరారు.

Post a Comment

Previous Post Next Post