Top News

చేనేత కార్మికుల అభివృద్ధే లక్ష్యం

 చేనేత కార్మికుల అభివృద్ధే లక్ష్యం

అధ్యక్షుడు కాముని రాజేశం

ఇర్కోడ్ చేనేత సహకార సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

 తెలంగాణ డైలీ న్యూస్-సీద్ధిపేట బ్యూరో

ఇర్కోడ్ చేనేత సహకార సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. అధ్యక్షుడిగా కాముని రాజేశం, ఉపాధ్యక్షురాలిగా గూడూరి మానస (సుజాత)తో పాటు కార్యదర్శి, కోశాధికారి, డైరెక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి రాజమౌళి ప్రకటించారు. అనంతరం నూతన కార్యవర్గానికి చేనేత మహిళా సహకార సంఘం నేత కార్మికులు ఘనంగా సన్మానం చేశారు. ఇర్కోడ్ చేనేత సహకార సంఘం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఏకగ్రీవంగా జరిగాయి. ఎన్నికల అధికారి రాజమౌళి ఫలితాలను ప్రకటిస్తూ అధ్యక్షుడిగా కాముని రాజేశం, ఉపాధ్యక్షురాలిగా గూడూరి మానస (సుజాత), కార్యదర్శిగా గూడూరి బాబు, కోశాధికారిగా ముదిగొండ రాజు (రాజేశం) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు.

అదేవిధంగా డైరెక్టర్లుగా కాముని దేవాబాయి, కొంక విఠల్, గుండ్ల వరలక్ష్మి, బొద్దుల మనోహర్, ముదిగొండ నిత్యానందం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.

ఎన్నికల అనంతరం నూతన కార్యవర్గ సభ్యులకు చేనేత మహిళా సహకార సంఘం నాయకులు, నేత కార్మికులు ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఎన్నికైన కాముని రాజేశం మాట్లాడుతూ, చేనేత కార్మికులకు ఏడాది పొడవునా నిరంతర ఉపాధి కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.



Post a Comment

Previous Post Next Post